ధర్నా చౌక్ లో హింధూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన

హిందూ ఆలయాలు  విగ్రహాలను ధ్వంసం చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ.. ఇటీవల రాష్ట్రంలో హిందూ ఆలయాలు, దేవత మూర్తులను ధ్వంసం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి తగిన విధంగా శిక్ష విధించాలని బజరంగ్దళ్, విహెచ్ పి నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో వరుస ఘటనలకు నిరసనగా వారి ఆధ్వర్యంలో హిందూ దేవతామూర్తులపై ధ్వంసం చేస్తున్న హిందూ వ్యతిరేక వాదుల దిష్టిబొమ్మ ను దహనం  చేశారు....