25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ వేగవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇందల్వాయి తహసీల్దార్ బాలయ్య

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి, లోలం, మల్లాపూర్ గ్రామాల్లో శనివారం తహసీల్దార్ బాలయ్య పర్యటించి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు) సూచించారు. గ్రామాల్లో ఫారాల పంపిణీ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలకు సంబంధించిన వివరాలను బీఎల్ఓలు యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా ప్రింట్ తీసిన ఎన్యుమరేషన్ ఫారాలనే పంపిణీ చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీపై బీఎల్ఓలకు అవసరమైన మార్గదర్శకాలు అందించామని తహసీల్దార్ బాలయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లోలం సర్పంచ్ రామకృష్ణ గౌడ్, మల్లాపూర్ సర్పంచ్ దర్శనం మోహన్, జీపీఓ రంజిత్, సంబంధిత బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.

 

The distribution of enumeration forms must be expedited.

More articles

Latest article