27.7 C
Hyderabad

ఘనంగా చత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండల కేంద్రంలో చత్రపతి శివాజీ మహారాజ్, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బహుజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం చత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షుడు రాజేష్ రక్షక్ మాట్లాడుతూ బహుజన చక్రవర్తి భారతదేశంలో మొదటిసారి బలహీన వర్గాల ప్రజలకు తన రాజ్యంలో కొల్హాపూర్ సంస్థానంలో ప్రజలందరికీ న్యాయం చేకూరేలా బలహీన వర్గాలకు హక్కులు పొందేలా మొదటిసారి రిజర్వేషన్ 50% కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు చిట్యాల రాజేష్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, జేఏసీ మండల అధ్యక్షులు జుంగల గణేష్, ప్రధాన కార్యదర్శి సంగేపు ఆనంద్, ఉపాధ్యక్షులు సునీల్, బహుజన సంఘాల నాయకులు రేండ్ల రమేష్, గన్నారపు రాజేశ్వర్, ఎండి మునీర్, అట్లా పోచయ్య, ముని మాణిక్యం అశోక్, సాయన్న, దొబ్బల మహేష్, రాందాస్, కిరణ్ జైపాల్, భరత్, సాగర్, రవి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article