29 C
Hyderabad
Monday, August 3, 2026

పోలిసుల మని చెప్పి వ్యక్తి వద్ధ 50 వేలు వసూలు చేసిన నకిలీలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 2 లక్షలు తెచ్చివ్వాలని పోన్ లో బెదిరింపులు

. . . విచారణ జరుపుతున్న మూడవ టౌన్ పోలిసులు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలో పోలిసులమని చెప్పి ఓక వ్యక్తి వద్ధ రూ.50 వేలు వసూలు చేసిన సంఘటన అలస్యంగా వెలుగు చూసింది.  నగరంలోని నాగారంకు చెందిన నర్సగౌడ్ అనే వ్యక్తి ఈ నెల 17న నగరంలోని ప్రబాత్ టాకిస్ వద్ధ ఉన్న మద్యం షాపులో మద్యం సెవిస్తుండగా నలుగురు వ్యక్తులు వచ్చి తాము పోలిసులమని చెప్పి అతడిని అక్కడినుంచి పక్కకు తీసుకువేళ్లారు. అతని వద్ధనుంచి రూ.6 వేలు, సెల్ పోన్ లాక్కుని అతడిని ఖానాపూర్ శివారుకు తీసుకువేళ్లారు. నువు పలనా కేసులో ఉన్నావు, నీవు నిషేదిత మత్తు పధార్ధాలు రవాణా చేస్తున్నావు అని చెప్పి విచారణ పేరిట వేదించారు. అక్కడినుంచి బైపాస్ రోడ్డులోని స్మశానవాటిక వద్ధ తీసుకువేళ్లి మద్యం తాగుతు మళ్లి ఇంటరాగేషన్ పేరిట వేదించారు. అక్కడి నుంచి బైక్ ల మీదా మాణిక్ బండార్ ( చెక్క) వద్ధ కల్లుబట్టిలో విచారణ పేరిట వేదించారు. చివరకు నీ భర్తను విచారణకు తీసుకవేలుతున్నామని పోన్ లో నర్సా గౌడ్ భార్యను బెదిరించారు. రూ2.50 లక్షలు తీసుకువస్తే వదులుతామని బెదిరింపులకు దిగారు. నర్సగౌడ్ సతీమణి అక్కడకు మరో వ్యక్తితో వచ్చి రూ.50 వేలు ఇచ్చి భర్తను విడిపించింది. వారి వద్ధ ఉన్న పోన్ ద్వారనే మళ్లి పోన్ లు చేసి రూ.2 లక్షలు తెచ్చివ్వాలని బెదిరించడంతో ఈ నెల 18న స్థానిక మూడవ టౌన్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రాథమికంగా విచారణ జరుపుతున్నట్టు మూడవ టౌన్ ఎస్ఐ మహేష్ తెలిపారు.

More articles

Latest article