28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సెలవు రోజు కార్పొరేట్ కాలేజీలో తరగతుల నిర్వహణ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏబీవీపీ నాయకుల ఆందోళణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రభుత్వ సెలవు దినాల్లో నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) డిమాండ్ చేస్తుంది. శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ నిజామాబాద్ నగరంలోని ఆల్ ఫోర్స్, ఎస్సార్, బన్సల్ తదితర ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో యథేచ్ఛగా తరగతులు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ ఇందూరు నాయకులు ఆయా కళాశాలలకు చేరుకుని, యాజమాన్యాల తీరును నిరసిస్తూ క్లాసులను బలవంతంగా బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిoధర్ మాట్లాడుతూ.. లాభార్జనే ధ్యేయంగా కార్పొరేట్ సంస్థలు విద్యా చట్టాలను తుంగలో తొక్కుతున్నాయని మండిపడ్డారు. కనీసం సెలవు రోజుల్లో కూడా విశ్రాంతి లేకుండా తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఐఈఓ) ఈ వ్యవహారంపై వెంటనే స్పందించాలని, నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, మానసిక ఆరోగ్యాన్ని పణంగా పెడితే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో బాలకృష్ణ, దుర్గ దాస్, గుడ్డు, వీరేష్, నిఖిల్, రాజు, సోరబ్, రాజేష్, కార్తీక్, దినేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article