సెలవు రోజు కార్పొరేట్ కాలేజీలో తరగతుల నిర్వహణ
. . . ఏబీవీపీ నాయకుల ఆందోళణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రభుత్వ సెలవు దినాల్లో నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) డిమాండ్ చేస్తుంది. శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ నిజామాబాద్ నగరంలోని ఆల్ ఫోర్స్, ఎస్సార్, బన్సల్ తదితర ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో యథేచ్ఛగా తరగతులు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ ఇందూరు నాయకులు...