. . . ఒకరు మృతి.. ఇంకొకరికి గాయాలు
భిక్కనూరు, బతుకమ్మ :
పల్సర్ బైక్ ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం భిక్కనూరు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భిక్కనూరు మండల కేంద్రంలో ఎన్ హెచ్ 44 హైవే పై హైదరాబాద్ నుండి అదిలాబాద్ వెళ్తున్న బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో బైక్ పై ఉన్న అఖిల్ (19) మృతి చెందాడు. ఓంకార్ కు తీవ్ర గాయాలు కాగా జిల్లా ఏరియా దావఖానకు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని బైకును ఢీ కొన్న వాహనం కోసం గాలిస్తున్నారు.
