. . . ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
భిక్కనూర్, బతుకమ్మ :
లారీని ఆటో ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన గురువారం భిక్కనూరు మండలం బస్వాపూర్ ఎన్ హెచ్ 44 హైవే పై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్వాపూర్ కు చెందిన నలుగురు ఆటోలో ఇంటికి బయలుదేరే సమయంలో ముందు వెళ్తున్న లారీని ఓవర్ టెక్ చేయడంతో లారీకి తగలడంతో రమేష్ గౌడ్ (45) రక్తస్రావం తీవ్రమై అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్ తో పాటు మరో నలుగురు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సందర్బంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

