రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. గురువారం మండల కేంద్రంలోని 68వ పోలింగ్ బూత్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు కలిసి ఇంటింటికీ తిరిగి ఈ ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు స్థానిక ప్రజలకు ఫారాల ప్రాముఖ్యతను వివరిస్తూ, వాటిని సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, మాజీ సొసైటీ అధ్యక్షుడు, డిసిసి సెక్రెటరీ పత్తి రాము, బి.ఎల్.ఎ అడప సాయిలు, బి.ఎల్.ఓ అజ్మలొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
