నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ లో వీఆర్ లో ఉన్న ముగ్గురు ఎస్సైలకు పోస్టింగ్ లు ఇస్తూ కమిషనర్ సాయిచైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. వెకెన్సీ రిజర్వులో ఉన్న పి.సాయన్నకు 4వ టౌన్ కు పోస్టింగ్ ఇవ్వగా, ఎం.కళ్యాణికి 1వ టౌన్ కు, ఎల్.రాముకు బోధన్ టౌన్ కు పోస్టింగ్ లు ఇచ్చారు. పోస్టింగ్ లు ఇచ్చిన ఎస్సైలు విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
