29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

తాసిల్దార్ కార్యాలయంలో బి ఎల్ ఓ లకు, సూపర్వైజర్లకు సార్ పై శిక్షణ

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బిఎల్ఓ లకు, సూపర్వైజర్లకు సార్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఇందల్వాయి తాసిల్దార్ బాలయ్య వెల్లడించారు. ఈ మేరకు ఆయన బిఎల్ఓ లతో పాటు సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమంలో ఈనెల 25 నుండి జరిగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విజయవంతంగా చేయాలని కోరారు. జులై 1, 1987 ముందు పుట్టిన వారు ఓటరు వారి యొక్క సొంత గుర్తింపు కార్డు ఇస్తే సరిపోతుందన్నారు. అలాగే తేదీ జులై 1, 87 నుండి 2024 మధ్యల పుట్టిన వారు రెండు గుర్తింపు కార్డులు అనగా ఓటర్ ది, వాళ్ళ తల్లి లేదా తండ్రీ గుర్తింపు కార్డు ఇస్తే సరిపోతుందన్నారు. అలాగే డిసెంబర్ 2, 2004 తరువాత పుట్టిన వారు అతనిది, వాళ్ల తల్లీ లేదా తండ్రీ ఏం యుమరేషన్ జరుగు సమయంలో కొత్త ఓటర్ నమోదు, పోలింగ్ స్టేషన్ మార్పు ఫారాలను అనగా ఫారం సిక్స్ కొత్త ఓటర్ కు, అడ్రస్ చేంజ్ కు ఫాం 8 ఇవ్వబడునని శిక్షణ కార్యక్రమంలో సంబంధిత బి ఎల్ ఓ లకు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రేైనర్ వంశీ నాయక్, తహశీల్దార్ బాలయ్య, డిప్యూటీ తాసిల్దార్ శైలజ, గిర్ధవార్ ప్రవీణ్ సంబంధిత జిపిఓలు పాల్గొన్నారు.

More articles

Latest article