కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరో కీలక ముందడుగు పడింది. కామారెడ్డి టౌన్ ఎంఐఎం అధ్యక్షుడు ఇమ్రోస్ హైమద్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇమ్రోస్ హైమద్‌తో పాటు మహమ్మద్ అబ్దుల్, మహమ్మద్ ఆమేద్, జమీల్, అలీ తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పార్టీ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ వైపు వస్తున్నారని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం, గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ సిద్ధాంతాలు, ప్రజాసేవ పట్ల నమ్మకంతో పార్టీలో చేరిన నాయకులకు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, మాజీ కౌన్సిలర్లు పిడుగు సాయిబాబా, జమీల్, సలీం, బల్ల శ్రీనివాస్, బండారి శ్రీకాంత్, రాహుల్, ఆకాష్, శశి తదితర నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలో పలువురు ప్రముఖ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కార్యకర్తలు స్వాగతిస్తూ, ఇది పార్టీ విస్తరణకు నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు.

