కాంగ్రెస్ లో చేరిన ఎంఐఎం అధ్యక్షుడు
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరో కీలక ముందడుగు పడింది. కామారెడ్డి టౌన్ ఎంఐఎం అధ్యక్షుడు ఇమ్రోస్ హైమద్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇమ్రోస్ హైమద్‌తో పాటు మహమ్మద్ అబ్దుల్, మహమ్మద్ ఆమేద్, జమీల్, అలీ తదితరులు కాంగ్రెస్ కండువా...