. . . ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
. . . పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో ఆదివారం అభివృద్ధి, రాజకీయ కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథులుగా హాజరై పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు.

అనంతరం మహిళల ఆర్థిక సాధికారత, స్వయం సహాయక సంఘాల బలోపేతానికి దోహదపడే ఎస్‌హెచ్‌జీ మహిళా శక్తి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను డీసీసీ అధ్యక్షుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, గ్రామీణాభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధి విషయంలో ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

