26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రోడ్డుపై బురద నీటిలో కూర్చుని మాజీ ఎమ్మెల్యే షిండే నిరసన  

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కాంగ్రెస్ కు డెవలప్ మెంట్ పై చిత్తశుద్ధి లేదు

. . . బిచ్కుంధ మండల కేంద్రంలో బిఆర్ఎస్ నిొరసన

బిచ్కుంద, బతుకమ్మ:

 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ రోడ్డు పనులు ప్రారంభించాలని బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆదివారం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే రోడ్డుపై నీటి మడుగులో కూర్చుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాంక్షన్ అయిన రోడ్డు పనులు కాంగ్రెస్ పాలనలో రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ పూర్తికాక దుస్థితి నీ ఎదుర్కోవడానికి గల కారణం కాంగ్రెస్ పాలకులు సెంట్రల్ లైటింగ్ రోడ్డు పనుల పైన చిత్తశుద్ధి లేకపోవడమేనని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలకులు ప్యాకేజీల మీద ఉన్న శ్రద్ధ పాలనపై లేదని ప్రజా జీవనం అస్తవ్యస్తం అవుతున్నప్పటికి కాంగ్రెస్ నాయకులు చలిమంట కాల్చుకుంటున్నారు నాకేంటి, మాకేంటి అన్న ధోరణిలో కాంగ్రెస్ చోటామోటా నాయకులు అందరూ ఎవరి ధీమా వారు ఉన్నారని ప్రజా ఇబ్బందుల గురించి వారికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. కందర్ పల్లి నుండి మద్దెలచెరువు వరకు ఏడు మీటర్ల రోడ్డు వెడల్పు పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికిని పుల్కల్ గ్రామం శివారు వరకు చేసి ఎందుకు అర్ధాంతరంగా నిలిపివేశారు కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. పూర్తిస్థాయిలో గుంతల మయమైన రహదారిపై ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే జరగరాని సంఘటన జరిగితే స్పందిస్తారా అప్పటివరకు మొద్దు నిద్రలో ఉంటారా అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. వారం రోజుల వ్యవధిలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టలేనట్లయితే రోడ్డు పక్కన టెంట్ వేసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Former MLA Shinde stages protest sitting in muddy water on the road

More articles

Latest article