27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సైబర్ నేరాలపై విద్యార్థినిలకు అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

బీబీపేట్, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేరకు  శుక్రవారం బీబీపేట్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో మానవ అక్రమ రవాణా,షీ టీం , చైల్డ్ చైల్డ్ మ్యారేజెస్, సైబర్ క్రైమ్ ఫై ఏహెచ్టియూ, కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినిలకు షీటీం గురించి, సైబర్ నేరాల గురించి మూడ నమ్మకాలు గురించి, రోడ్డు భద్రత గురించి, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా నిర్మూలన, డ్రగ్స్, మత్తు పదార్థాలు గురించి అవగాహన కల్పించారు. షీటీం నెం. 8712686094, సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1 9 3 0 కు కాల్ చేసి వినియోగించుకోవాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల టోల్ ఫ్రీ నెంబర్ 100, 108, 1930, 181 ల విలువలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాబృందం సభ్యులు ప్రభాకర్, సాయిలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ ఆఫీసర్ రాజేందర్, కేజీబీవీ ఎస్ ఏ మంగ, ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

More articles

Latest article