28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

వడ్లకు జాలి పట్టిన తర్వాతనే కొనుగోలు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

బీబీపేట్, బతుకమ్మ : వడ్లకు జాలి పట్టిన తర్వాతనే కొనుగోలు చేయాలని బీబీపేట్ మండల ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్ అన్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్ల ఏర్పాటు, విధి విధానాలపై సంబంధిత అధికారులో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో ఉన్న ఇన్చార్జ్ లు వానాకాలం పంట కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 11 సెంటర్లకు గాను 8 సెంటర్లు ప్రారంభించామని తెలిపారు. మిగతావి కూడా రెండు రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే వరి ధాన్యం కొనుగోలు నవంబర్ ఫస్ట్ నుండి ఎక్కువ జరుగుతుందని, ప్రతి ఒక్క రైతుకు సీరియల్ నెంబర్ కేటాయించాలని ఆదేశించారు. రైతులందరికీ కూడా టెంటు, లైటు, వాటర్, బస్తాలు, కాంటా సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.  ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకొని జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపింస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తాసిల్దార్, బిబీపెట్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్, ఏఈఓస్ ఆర్ ఐ, సిఈ ఓపిఎస్సిసి అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article