ప్రభుత్వ జూనియర్ కళాశాలల బోధనపై ఇంటర్ విద్యాధికారి సమీక్ష
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతి విద్యార్థి ప్రతిరోజు కళాశాలకు హాజరు అయ్యేలా చూడాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి టి.రవికుమార్ సూచించారు. 2024 – 25 విద్యా సంవత్సరం కు గాను నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు జరుగుతున్న బోధన పై జిల్లా ఇంటర్ విద్య అధికారి టి.రవికుమార్ సమీక్షించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇంటర్ విద్యార్థి కార్యాలయంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల ల ప్రిన్సిపాల్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అర్ధ సంవత్సరం పరీక్షల నిర్వహణకు సిలబస్ పూర్తి చేయించడంపై దృష్టి సారించాలని అన్నారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు కళాశాలకు హాజరు అయ్యేలా చూడాలని అలాగే ప్రతి విద్యార్థికి విషయ పరిజ్ఞానం అంచనా వేసి దిగివ స్థాయిలో ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక బోధనా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.

