ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామ ఉప సర్పంచ్ మూడ్ దయానంద్ నిజామాబాద్ జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. శుక్రవారం నిజామాబాద్‌లోని దుబ్బ గల్లీలో గల మేరు సంఘం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జిల్లా ఉప సర్పంచ్‌ల సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఉప సర్పంచ్‌ల ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా నూతన కార్యవర్గంలో రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బోట్ల కార్తీక్, మూడ్ దయానంద్ పేరును జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటించారు. ఈ సందర్భంగా మూడ్ దయానంద్ మాట్లాడుతూ ఉప సర్పంచ్‌ల సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తానని పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్, జిల్లా అధ్యక్షుడు మహేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వికార్ పాషాతో పాటు వివిధ మండలాల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు హన్మంత్ రెడ్డి, ఆత్మరాం, చరణ్, భూమేశ్వర్, సేవాలాల్, చంద్రశేఖర్ లావుడ్యా, బద్దం శ్రీనివాస్ రెడ్డి తదితరులకు మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల అధ్యక్షులు, ఉప సర్పంచ్‌లకు మూడ్ దయానంద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
