26.2 C
Hyderabad
Monday, August 3, 2026

మోదీ నాయకత్వం యువత భవిష్యత్తుకు భరోసా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యువతకు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి అన్నారు. ఇందూరు నగరంలోని దుబ్బా మేరు సంఘం భవనంలో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఇందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “నమో జెన్ జడ్ యువ సమ్మేళనం” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బండ కార్తీక రెడ్డి, దినేష్ పటేల్ కులాచారి, గోపిడి స్రవంతి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా యువ మోర్చా అధ్యక్షులు సతీష్ రెడ్డి సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బండ కార్తీక రెడ్డి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం యువత అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, ప్రధానమంత్రి ముద్ర యోజన, పీఎం ఇంటర్న్‌ షిప్, ఖేలో ఇండియా వంటి పథకాల ద్వారా యువతకు ఉపాధి, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు పెరిగాయని తెలిపారు. దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం యువత శక్తిని దేశ అభివృద్ధికి వినియోగిస్తూ ప్రపంచ స్థాయిలో భారత యువతకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గోపిడి స్రవంతి రెడ్డి మాట్లాడుతూ, మహిళా యువత సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, డిజిటల్ రంగాల్లో యువత మరింత ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యువజన సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై యువతకు నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర కో – కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, బీజేపీ నాయకులు స్వామి యాదవ్, నారాయణ యాదవ్, బీజేవైఎం నాయకులు వీపుల్ రావు, వినోద్ రెడ్డి, రాజ్ గణేష్, రాజశేఖర్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో యువత హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

Modi's leadership assures the future of the youth.

More articles

Latest article