24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మానవత్వంతో రక్తదానం చేసి ప్రాణాలను రక్షించండి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎస్ఈ పీవీ రాజేశ్వర్ రావు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మానవత్వంతో రక్తదానం చేసి ప్రాణాలను రక్షించాలని సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) పీవీ రాజేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాత వారోత్సవాలను పురస్కరించుకొని ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ నిజామాబాద్ ఆధ్వర్యంలో తలసీమియా బాధితుల కోసం ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగుల గోల్డెన్ జూబ్లీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా రక్తదానం చేసి కార్యక్రమానికి ఆదర్శంగా నిలిచారు. డీఈ ఆపరేషన్ బోధన్ ఎండీ ముక్తార్ కూడా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు ప్రతిరోజూ వినియోగదారులకు సేవలు అందించడంతో పాటు సామాజిక బాధ్యతగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, డీఈలు ఎం. శ్రీనివాసరావు, ఎండీ ముక్తార్, వెంకటరమణ, హరిచంద్ర నాయక్, తోట రాజశేఖర్, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏడీఈ పీఓ పోశెట్టి, విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు రఘునందన్, పి. గంగాధర్, గంగారాం నాయక్, బాలేష్ కుమార్, ఆర్. చంద్రశేఖర్, బి. అశోక్ కుమార్, కాశీనాథ్, రాజేందర్, వేణుగోపాల్, సురేష్ కుమార్, ప్రసాద్ రెడ్డి, ఎండీ చాంద్ పాషా, కేఎస్ఆర్ మూర్తి, జి. శ్రీనివాస్, లింగం, బాబా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 50 మంది విద్యుత్ ఉద్యోగులు, వివిధ యూనియన్లు మరియు అసోసియేషన్ల నాయకులు రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ కోశాధికారి కరిపే రవీందర్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Donate blood out of humanity and save lives.

More articles

Latest article