27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నందిపేట్ గ్రామానికి 3,000 మొక్కలు కేటాయింపు

Must read

📰 Generate e-Paper Clip

 

నందిపేట్, బతుకమ్మ :

 

నందిపేట్ గ్రామానికి చిన్నాపూర్ నర్సరీ నుండి 3,000 మొక్కలను కేటాయించాలని కోరుతూ నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం గురువారం నూడా చైర్మన్ కేశవేణు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కల అవసరాన్ని సర్పంచ్ వివరించారు. సర్పంచ్ వినతిపై సానుకూలంగా స్పందించిన నూడా చైర్మన్ కేశవేణు వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసి, చిన్నాపూర్ నర్సరీ నుండి నందిపేట్ గ్రామానికి 3,000 మొక్కలను కేటాయించారు. గ్రామ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు సహకరించిన నూడా చైర్మన్ కేశవేణు కి సర్పంచ్ ఎర్రం లింగం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article