. . . ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
జుక్కల్, బతుకమ్మ :
గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ గృహ పథకంలో తొలి ప్రాధాన్యత కల్పించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అధికారులను ఆదేశించారు. జుక్కల్ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అధ్యక్షత వహించగా, అదనపు కలెక్టర్ నిమ్మ వి.గిరి, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇందిరమ్మ గృహ పథకం లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణ దశకు అనుగుణంగా డేటా సక్రమంగా అప్‌డేట్ అయ్యిందో లేదో అధికారుల ద్వారా పరిశీలించుకోవాలని సూచించా రు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, లబ్ధిదారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

