బాసర, బతుకమ్మ :
బాసర ట్రిపుల్ ఐటిలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని ఆత్మహత్యయత్నం చేసింది. ఈ సంఘటన బుధవారం జరిగింది. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన (17) బాలిక బాసరలో ట్రిపుల్ ఐటి హస్టల్ భవనం పై నుంచి దూకింది. అక్కడ ఉన్న విద్యార్థులు, సిబ్బంది ముందుగా బాలికను బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నిజామాబాద్ జిజిహెచ్ కు తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంలో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రిఫర్ చేసినట్లు తెలిసింది. బాలిక ఆత్యహత్య యత్నానికి గల కారణాలు తెలియ రాలేదు. బాసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు తెలిసింది.
