. . . తప్పిపోయిన వృద్ధురాలిని సురక్షితంగా బంధువులకు అప్పగింత
కామారెడ్డి, బతుకమ్మ :
హైదరాబాద్‌కు చెందిన సుగుణమ్మ (78) అనే వృద్ధురాలు కామారెడ్డిలో ఒక శుభకార్యానికి వచ్చి, కొత్త బస్టాండ్‌లో దిగి దారి తెలియక తికమకపడ్డారు. అక్కడ డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుళ్లు భవాని, సరిత ఆమెను గమనించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎస్హెచ్ఓ నరహరి (ఇన్స్ పెక్టర్) ఆదేశాలతో బ్లూకోల్ట్ కానిస్టేబుళ్లు నర్సింహులు, అశోక్ వెంటనే రంగంలోకి దిగి, ఆమె కామారెడ్డి కల్కి నగర్‌కు చెందిన తంగేనా పల్లి నరసింహ చారి అత్తమ్మగా గుర్తించారు. అనంతరం వృద్ధురాలిని వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. సమయస్ఫూర్తితో స్పందించి వృ ద్ధురాలిని కుటుంబసభ్యుల వద్దకు చేర్చిన కామారెడ్డి పోలీసులపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

