30.9 C
Hyderabad
Monday, August 3, 2026

భిక్కనూరు పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూర్, బతుకమ్మ :

 

భిక్కనూరు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై వారి విధులు, బాధ్యతలపై ఆరా తీశారు. అనంతరం ఎస్ఐ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా సిబ్బంది చూడాల్సిన అవసరం ఉందన్నారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, కేడీలు, నిందితులపై సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతిరోజు వాహనాల తనిఖీ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

District SP conducts surprise inspection of Bhikkanoor Police Station.

More articles

Latest article