27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ అరవింద్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

జిల్లా కేంద్రంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఎంపీ అరవింద్ ధర్మపురి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ఆధునిక వసతులతో పాటు ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా సేవలు అందుతున్న తీరును ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కేంద్రంలో అందుతున్న సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.

 

MP Arvind visits Passport Seva Kendra.

 

ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రం మహారాష్ట్రకు చెందిన అనేక మంది కూడా ఈ కేంద్రం ద్వారా పాస్‌పోర్ట్ సేవలను పొందుతున్నారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు కొనసాగించాలని సూచించారు.

 

MP Arvind visits Passport Seva Kendra.

More articles

Latest article