నందిపేట్, బతుకమ్మ:
యూరియా యాప్ ను రద్దు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. సోమవారం ఆర్మూర్ నియోజకవర్గం లోని నందిపేట్ మండలం లో యూరియా యాప్ రద్దు చేయాలని రైతులు చేపట్టిన ధర్నాకు బిఆర్ఎస్ మద్దతు తెలిపింది. నందిపేట్ – నిజామాబాద్ రహదారిపై రైతులు చేపట్టిన నిరసన కు మద్దతు తెలిపిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదన్నారు. ఈ నిరసనలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు తో పాటు పార్టీ మండల అధ్యక్షుడు, రైతులు పాల్గొన్నారు.

