యూరియా యాప్ రద్దు చేయాలని బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా

   నందిపేట్, బతుకమ్మ: యూరియా యాప్ ను రద్దు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. సోమవారం  ఆర్మూర్ నియోజకవర్గం లోని నందిపేట్ మండలం లో యూరియా యాప్ రద్దు చేయాలని రైతులు చేపట్టిన ధర్నాకు బిఆర్ఎస్ మద్దతు తెలిపింది. నందిపేట్ – నిజామాబాద్ రహదారిపై రైతులు చేపట్టిన నిరసన కు  మద్దతు తెలిపిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదన్నారు. ఈ నిరసనలో  జిల్లా పరిషత్ మాజీ...