30.9 C
Hyderabad
Monday, August 3, 2026

నీట్ – యూజీ 2026 రీ – ఎగ్జామినేషన్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ ఎం.రాజేష్ చంద్ర

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ – యుజి 2026 రీ-ఎగ్జామినేషన్‌ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ విస్తృత భద్రతా చర్యలు చేపట్టిందని నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్, కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 21 న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న ఈ పరీక్ష కోసం జిల్లాలో మొత్తం ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజీ (ఆటోనోమస్), యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (డిచ్‌పల్లి), గవర్నమెంట్ జూనియర్ కాలేజీ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ (బోధన్), గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ (నిజామాబాద్), శ్రీ బిగాల కృష్ణమూర్తి జెడ్‌పీహెచ్‌ఎస్ (మాక్లూర్), తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ జూనియర్ కాలేజీ ఫర్ గర్ల్స్-1 (నాగారం) పరీక్షా కేంద్రాలుగా పనిచేయనున్నాయి. పరీక్షల నిర్వహణ దృష్ట్యా జూన్ 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ (పాత సెక్షన్ 144 సీఆర్‌పీసీ) అమల్లో ఉంటుందని కమిషనర్ తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా చేరడాన్ని నిషేధించారు. అదేవిధంగా పరీక్షల రోజున కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ దుకాణాలు, స్టేషనరీ షాపులను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రం వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన ఎం. రాజేష్ చంద్ర, ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

More articles

Latest article