28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సాగునీటి కాలువల రూపుమాపు…

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అధికారుల అండదండలతోనే సాగునీటి కాలువలను కబ్జా

 

. . . పట్టించుకోని అధికారులు

 

. . . మరికొన్ని ప్రాంతాల్లో సాగునీటి కాలువలను మురికి కూపాలుగా మారుస్తున్న వైనం

 

ఇందల్వాయి, బతుకమ్మ

 

ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి పెద్ద చెరువు నుండి వచ్చే సాగునీటి కాలువలను కొన్ని గ్రామాలలో కబ్జా చేస్తూ కొన్ని ప్రాంతాల్లో మురికి కాలువలుగా.. మరికొన్ని ప్రాంతాల్లో సాగునీటి కాలువనే 12 ఫీట్ల రోడ్డుగా మలుచుకుంటున్నారు. ఈ మేరకు ఇందల్వాయి మండలంలోని తీర్మాన్ పల్లి గ్రామంలో గత కొన్ని దశాబ్దాలుగా సాగునీటి కోసం ఏర్పాటు చేసిన కాలువలను అధికారుల మద్దతుతో పాలకులు యథేచ్చగా కాలువల కబ్జాకు పాల్పడుతున్న పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. దీనిపై స్థానిక తహసీల్దార్ తో పాటు పోలీసులకు జిల్లా కలెక్టర్ కి సమాచారం అందించిన కనీస స్పందన లేదని మండల ప్రజలు, ముఖ్యంగా తీర్మన్ పల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్ట పగలు నల్ల మట్టితో రోడ్డును తడిపించేలా సాగునీటి కాలువను పూడ్చివేస్తున్న అటువైపు కన్నెత్తి చూడని అధికారుల తీరుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు వైపు ప్రజాప్రతినిధుల అండదండలు భూములు ఉండడమే దీనికి నిదర్శమని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. అయినా స్థానిక తహసీల్దార్ బాలయ్య కనీసం సంఘటన స్థలానికి వెళ్లకుండానే నిర్లక్ష్య సమాధానాలు చెప్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. దశాబ్దాల క్రితం ఇందల్వాయి పెద్ద చెరువు నుండి సుమారుగా ఏడు గ్రామాలకు సాగునీరు అందలేదని గుర్తు చేశారు. అలాంటి సాగు నీరు కోసం ఏర్పాటు చేసిన కాలువలను ప్రస్తుత పాలకులు, అధికారులు కుమ్మక్కై కబ్జాలు చేస్తూ తమ తమ సొంత పొలాలకు రోడ్డుగా మార్చుకుంటున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం పై పలువురు అసంతృప్తి చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజల అవసరాల మేరకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపాల్ రెడ్డి అధికారులను ఆదేశిస్తున్న ఆచరణలో మాత్రం కొనసాగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు కాలువను కబ్జా చేసి రోడ్డుగా మలిచిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జేసీబీలను, ట్రాక్టర్ లను సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

 

Eradicating irrigation canals...

 

. . . సాగునీటి కాలువను కబ్జా చేసే ప్రయత్నం మా దృష్టికి రాలేదు

. . . ఇందల్వాయి తాసిల్దార్ బాలయ్య

ఇందల్వాయి మండలంలోని తీర్మాన్ పల్లి గ్రామంలో ని హెచ్ పి పెట్రోల్ బంక్ వెనుక ఉన్న ఇందల్వాయి నుండి తీర్మాన్ పల్లి వరకు వెళ్లే సాగునీటి కాలువను కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని బతుకమ్మ రిపోర్టర్ తమ దృష్టికి తీసుకురాగా ఇప్పటివరకు అలాంటి సంఘటన తమ దృష్టికి రాలేదని ఇందల్వాయి తహసిల్దార్ బాలయ్య వెల్లడించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయనన్నారు. సాగునీటి కాలువను రోడ్డుగా మలుచుకోవడం చట్ట విరుద్ధమని, అలాంటి వ్యక్తులు ఎంతటి వారైనా చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

Eradicating irrigation canals...

More articles

Latest article