. . . విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నరేందర్ రెడ్డి
కరీంనగర్, బతుకమ్మ :
ప్రతిష్టాత్మక ఐఐటి, నీట్ పరీక్షలలో అవకతవకలు జరగడం, పరీక్షల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించడం విద్యా వ్యవస్థకు సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు “అల్ఫోర్స్” డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ వద్ద కరీంనగర్ జిల్లా ఎన్ఎస్ యుఐ ఉపాధ్యక్షులు ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భారీ నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని, నీట్ పరీక్ష రద్దు, మళ్ళీ నిర్వహించడం చాలా అవమానకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంజన్ కుమార్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత రెడ్డి, మహాలక్ష్మి, చింతల శ్రీనివాస్ రెడ్డి, సమ్మిరెడ్డి, ధ్యావ భాస్కర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కిమ్ ఫహద్, గుర్రం వాసు గౌడ్, రెహమాన్, రమేష్, విక్రమ్, ఎండి అయ్యాన్, సిహెచ్ చేతన్ రెడ్డి, సోఫియాన్, అన్సారి అనిల్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.

