28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బిఆర్ఐసిఎస్ దేశాలలో బంగారం ధరల ప్రభావంపై టీ.యూ లో పరిశోధన

Must read

📰 Generate e-Paper Clip

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి ఎం.నర్సింహులు “డేటా సైన్స్ పద్ధతుల ద్వారా బిఆర్ఐసిఎస్ దేశాలలో బంగారం ధరల ప్రభావం – స్టాక్ మార్కెట్ యుఎస్ డాలర్ పై అధ్యయనం” అనే అంశంపై స్టాటిష్టిక్స్ విభాగం అధిపతి ప్రొఫెసర్ కె. సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పరిశోదన పూర్తిచేశారు. ప్రొఫెసర్ ఎస్.ఏ.జ్యోతి రాణి, ఉస్మానియా యూనివర్సిటీ, బాహ్య పరిశీలకురాలిగా వ్యవహరించారు. ఈ పరిశోధన ద్వారా బంగారం ధరలు పెరిగినప్పుడు స్టాక్ మార్కెట్లు ఎలా స్పందిస్తాయో శాస్త్రీయంగా విశ్లేషించడం జరుగుతుంది. దీనివల్ల పెట్టుబడిదారు లు తమ పోర్ట్‌ ఫోలియోలో బంగారం, షేర్ల మధ్య సరైన సమతుల్యతను ఏర్పరచుకుని రిస్క్‌ ను తగ్గించే వ్యూహాలను రూపొందించుకోవడానికి అవకాశం లభిస్తుంది. అదేవిధంగా యుఎస్ డాలర్ బలపడినప్పుడు లేదా బలహీనపడి నప్పుడు బిఆర్ఐసిఎస్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడే ప్రభావాన్ని, కరెన్సీ మార్పిడి రేట్లు, బంగారం ధరల మధ్య గల సంబంధాన్ని డేటా సైన్స్ పద్ధతులతో అధ్యయనం చేస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలు విధాన నిర్ణేతలకు, ఆర్థిక నిపుణులకు, పెట్టుబడిదారులకు నిర్ణయాలు తీసుకోవడంలో మార్గదర్శకంగా నిలుస్తాయని ఎం.నర్సింహులు తెలిపారు. ఈ సందర్బంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్, రిజిస్ట్రార్ లు విద్యార్థిని అభినందించారు.

More articles

Latest article