బిఆర్ఐసిఎస్ దేశాలలో బంగారం ధరల ప్రభావంపై టీ.యూ లో పరిశోధన

  డిచ్ పల్లి, బతుకమ్మ :   తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి ఎం.నర్సింహులు "డేటా సైన్స్ పద్ధతుల ద్వారా బిఆర్ఐసిఎస్ దేశాలలో బంగారం ధరల ప్రభావం - స్టాక్ మార్కెట్ యుఎస్ డాలర్ పై అధ్యయనం" అనే అంశంపై స్టాటిష్టిక్స్ విభాగం అధిపతి ప్రొఫెసర్ కె. సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పరిశోదన పూర్తిచేశారు. ప్రొఫెసర్ ఎస్.ఏ.జ్యోతి రాణి, ఉస్మానియా యూనివర్సిటీ, బాహ్య పరిశీలకురాలిగా వ్యవహరించారు. ఈ పరిశోధన ద్వారా బంగారం ధరలు పెరిగినప్పుడు స్టాక్ మార్కెట్లు ఎలా స్పందిస్తాయో శాస్త్రీయంగా విశ్లేషించడం జరుగుతుంది....