. . .ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
గత 80 సంవత్సరాలు గా ఎన్నో పోరాటాల ద్వారా ఈరోజు ఉపాధ్యాయులు అనుభవిస్తున్న అనేక సౌకర్యాలు సాధించిపెట్టిన సంఘం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అని జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ అన్నారు. మంగళవారంస్టేట్ టీచర్స్ యూనియన్ 80 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్ టి యు భవన్లో జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. సంఘ వ్యవస్థాపకుడు మగ్దూం మొయినుద్దీన్ కి నివాళులర్పించిన పూర్వ సంఘం సభ్యులు కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పాఠశాలల పరిరక్షణ కూడా సంఘ బాధ్యత అని పేర్కొన్నారు మన ఉపాధ్యాయుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ అదే విధంగా బడుగు బలహీన వర్గాల కోసం ఉన్నటువంటి పాఠశాలలను పరిరక్షించు కోవాల్సిన బాధ్యత కూడా సంఘం పైన ఉందని పేర్కొన్నారు సంఘం ఆవిర్భవించిన తర్వాత ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మొదటిసారిగా పి ఆర్ సి ,డిఏ ల ఆవశ్యకతను చెప్పి పెన్షన్ కోసం పోరాడి సాధించిన సంఘం ఎస్టియు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మహేశ్వర్ గంగా కిషన్, పవన్, యాదగిరి రత్నాకర్, అర్బన్ అధ్యక్ష కార్యదర్శులు రాకేష్ సంజీవ్,సాయి తేజ, ఎడపల్లి మండల బాధ్యులు యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

