25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పెరుగుతున్న ధరలను  కేంద్ర ప్రభుత్వం నియంత్రించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెరుగుతున్న ధరలను  నియంత్రించాలని  సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి లోని శ్రామిక భవన్ లో వనమాల కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతుందన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్న ఇంధన ధరలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారని , ద్వారా సామాన్యులకు చిరు వ్యాపారుల పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే భారత ఆర్థిక రంగాన్ని, ప్రజల జీవన స్థితిగతులు చిన్నాభిన్నం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని హితవు పలికారు. లేనిచో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ విలేఖరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్ జిల్లా నాయకులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్, కే.గంగాధర్, బి.మల్లేష్, ఎం.సుధాకర్ నాయకులు సాయి రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article