పెరుగుతున్న ధరలను  కేంద్ర ప్రభుత్వం నియంత్రించాలి

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెరుగుతున్న ధరలను  నియంత్రించాలని  సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి లోని శ్రామిక భవన్ లో వనమాల కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతుందన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్న ఇంధన ధరలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వంట...