. . . విద్యా శిరోమణి అవార్డు ప్రదానోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్…
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
మార్కుల కోసం, ర్యాంకుల అని విద్యార్థుల పై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచోద్ధని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. శాలివాహన ( కుమ్మరి ) ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని అంబేద్కర్ భవన్ లో విద్యార్థులకు విద్య శిరోమణి అవార్డు ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ… పదో తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నతమైన లక్ష్యంతో ముందుకెళ్లాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుకుని జిల్లాకు, దేశానికి మంచి పేరు తేవాలని చెప్పారు. విద్య ను ఎవరు దొంగిలించే అవకాశం లేదని, విద్యతోనే ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చన్నారు. ప్రధానంగా ప్రతి విద్యార్థి ఫోన్ల కు దూరంగా ఉండాలని, ఫోన్లతో మంచి ఎంతో చెడు కూడా అంతకు రెట్టింపు ఉంటుందన్నారు. చదువు ఓక్కటే సరిపోధని దానికి అనుగుణంగా స్కిల్స్ ( మెలకువలు) ఉంటే కూడా రాణించవచ్చాన్నారు.

కుమ్మరి కులస్తులు రాజకీయంగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, శాలివాహన కులస్తులకు ప్రత్యేక గుర్తింపు నిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. అంతకుముందు విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కుమ్మర ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ భూపతి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ రావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సాయి కుమార్, జిల్లా గౌరవాధ్యక్షులు కనకం గంగాధర్, సంఘ సభ్యులు హనుమాన్, విసిగిరి గంగారం, ఆర్ కే ప్రజాపతి, సిర్పూరు చిన్నయ్య, జిల్లా మాజీ అధ్యక్షుడు చందూర్ బాబు, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీ నారాయణ, బీజేపీ నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు.

