25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యావంతులను గెలిపించండి

Must read

📰 Generate e-Paper Clip

. శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ  స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్

నిజామాబాద్ సిటీ, బతకమ్మ: శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గాల్లో విద్యావంతులను గెలిపించాలని, సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్క విద్యావంతుడు దోహద  పడాలని స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్ అన్నారు.  నగరంలోని ప్రెస్ క్లబ్ లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చాలామందికి ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన లేదని వారికోసమే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపించిఆశీర్వదించాలని కోరారు. తాను స్వతంత్రంగానే పోటీ చేస్తున్నానని అన్నారు. సమావేశంలో డాక్టర్ నరేశ్, నిఖిల్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article