బాన్సువాడలో పోలీసుల కార్డెన్ సెర్చ్…
* డీఎస్పీ విఠల్ రెడ్డి…
బాన్సువాడ బతుకమ్మ :
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని తాడ్కోల్ లో ఉన్న డబుల్ బెడ్రూం కాలనీలో శనివారం రాత్రి పోలీసులు భారీ ఎత్తున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సిఐలు, ఎస్ఐలు, ప్రత్యేక బృందాలు సహా సుమారు 60 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాలనీలో ప్రతి ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు నివాసితుల వివరాలను సేకరించి ఆధార్ కార్డులను పరిశీలించారు. అలాగే కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు, మద్య సేవనం, గంజాయి వినియోగం, మహిళలపై వేధింపులు, ఇతర చట్ట వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయా అనే అంశాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు.డబుల్ బెడ్ రూమ్ కాలనీలో మొత్తం వెయ్యికి పైగా ఇళ్లు ఉండగా, సుమారు 500కు పైగా ద్విచక్ర వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు.

తనిఖీల సందర్భంగా ఆర్సీ బుక్ లు లేని వాహనాలు, ఇతరుల పేర్లపై నమోదైన అనుమానాస్పద వాహనాలు గురించి సుమారు 150 ద్విచక్ర వాహనాలు, 30 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొనడం, నేరస్తుల కదలికల కార్యకలాపాలను అరికట్టడం, నియంత్రించడం కార్డెన్ సెర్చ్ ప్రధాన ఉద్దేశ్యం. కొందరు దొంగ వాహనాలు వినియోగిస్తున్నట్లు, గంజాయి , మద్యం సేవిస్తున్న ట్లు సమాచారం అందడంతో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టాం అని తెలిపారు.

