26.2 C
Hyderabad
Monday, August 3, 2026

విధుల నుంచి శాశ్వతంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ట్యూటర్ తోలగింపు

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  కేసు నమోదు చేసిన పోలీసులు

. . .  విద్యార్థినిని వేధించినందుకు యాక్షన్

 నిజామాబాద్, బతుకమ్మ:

విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన బోధకుడు డాక్టర్ (ట్యూటర్) తన వద్ద విద్యా నేర్చుకుంటున్న విద్యార్థినికి వేధింపులు కు దిగాడు. సెల్ ఫోన్ లో వాట్సాప్, ఇన్ స్టా మెసేజ్ లతో వేదించాడు. దానితో విద్యార్థిని బలవన్మరణానికి యత్నించగా అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనితో  శుక్రవారం నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ నర్సింగ్ కళాశాలలో కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ గా ( ట్యూటర్ )గా పనిచేస్తున్న డా. గౌతంను విధుల నుంచి తొలగించినట్టు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్  క్రిష్ణ మోహన్ తెలిపారు.  నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఓ విద్యార్థిని  బిఎస్సి నర్సింగ్  రెండవ సంవత్సరం చదువుతుంది. అక్కడ చదువుతున్న జీజీహెచ్ లో శిక్షణ పోందుతు పనిచేస్తుంది. సంబంధిత విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ గౌతం విద్యార్థినీ సెల్ పోన్ ద్వారా వేధింపులకు పాల్పడ్డారు. దానితో ప్రైవేట్ హస్టల్  లో ఉంటున్న విద్యార్థిని  గురువారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. తోటి విద్యార్థులు ఆమెను జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకున్న విద్యార్థి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపాదికన కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో  (ట్యూటర్) గా పనిచేస్తున్న డా. గౌతంను విధుల నుంచి శాశ్వతంగా ( టెర్మినేషన్ ) తొలగించినట్టు తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్య యత్నం నేపథ్యంలో పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు గౌతం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు..

More articles

Latest article