25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

తాళం వేసిన ఇళ్ళలో చోరిలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సుద్దపల్లి గ్రామంలో మూడిళ్లల్లో బంగారం, నగదు చోరి

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

డిచ్‌పల్లి మండలం సుద్దపల్లిలో వరుస చోరీలు జరిగాయి. తాళం వేసిన మూడు ఇళ్ళలో దొంగలు హల్ చల్ చేశారు. సుద్దపల్లి గ్రామానికి చెందిన మలావత్ నరేష్ బుధవారం ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి వేరే ఊరికి వెళ్లాగా అర్ధరాత్రి ఇద్దరు దుండగులు నరేష్ ఇంటి వద్ద ఉన్న సీసీ టీవీ ధ్వంసం చేసి తాళం పగులగొట్టి 3 తులాల బంగారం, రూ.45వేలు ఎత్తుకెళ్లారు.అదే గ్రామానికి చెందిన  రాజశేఖర్, సుమన్ (అన్నదమ్ములు) తమ ఇళ్లకు తాళాలు వేసి డాబాలపై నిద్రించారు. వారి ఇళ్లలోకి ప్రవేశించిన దొంగలు ఇళ్లలోని తులం బంగారం, రూ.10వేలు నగదు,  సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు.దొంగల అలజడికి నిద్రలేన బాధితులు చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకొన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article