24.7 C
Hyderabad
Monday, August 3, 2026

నంబర్ లను మార్ఫింగ్ చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

 

రాజన్న సిరిసిల్లా, బతుకమ్మ :

 

నంబర్ లేకుండా, నంబర్ ప్లేట్‌కు అడ్డుపెట్టడం, సగం నంబర్లు కనిపించేలా ఉంచడం, నంబర్లను మార్ఫింగ్ చేసి వాహనాలు నడిపిన వారిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు. బుధవారం ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ తొలగింపు, నంబర్ ప్లేట్ మార్ఫింగ్ వంచి వాటిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న 55 మందిని వారు పట్టుకుని కేసులు నమోదు చేశారు.

 

Strict legal action will be taken against those who morph numbers.

 

అలాగే నంబర్ ప్లేట్ లు తొలంగించిన, కనిపించకుండా మార్ఫింగ్ చేసిన 24 వాహానాలను పట్టుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం, వాహనాలకు నంబర్ ప్లేట్ లను తొలగించడం, నంబర్ లను మార్ఫింగం చేయడం చట్టరీత్యా నేరమని, ప్రతి వాహనా దారుడు తన వాహనానికి నంబర్ ప్లేట్  ను స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

 

Strict legal action will be taken against those who morph numbers.

More articles

Latest article