. . . జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
లింగంపేట్, బతుకమ్మ
వర్షాకాలంలో పంటలు సాగు చేస్తున్న రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఎరువులు విత్తనాలు విక్రయ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలోని ఎరువుల నిల్వలు, విక్రయ రిజిస్టర్లు, లైసెన్సులు బిల్లుల నిర్వహణ పరిశీలించారు. అధిక ధరలకు కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని వ్యాపారులకు సూచించారు. ప్రతి విక్రయానికి తప్పని సరిగా బిల్లు ఇవ్వాలని దుకాణ నిర్వాహకుల కు ఆయన సూచించారు. రైతులు తమకు అవసరమైన ఎరువులను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువుల విక్రయాలకు పాల్పడితే సంబంధిత దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతే కాకుండా విత్తన విక్రయ లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యవసాయ అధికారి వెంట మండల వ్యవసాయ అధికారి నర్సింలుతో పాటు ఎరువులు పురుగుల మందులు విక్రయ వ్యాపారులు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

