నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలోని కీలకమైన పోలీస్ స్టేషన్ ల ఎస్ హెచ్ వోలను బదిలీ చేస్తూ వీఆర్ లో ఉన్న వారికి పోస్టింగ్ లు ఇస్తూ బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. నిజామాబాద్ 2వ టౌన్ ఎస్ హెచ్ వోగా పని చేస్తున్న ముజాహిద్ ను ఎస్ బికి బదిలీ చేశారు. వీఆర్ లో ఉన్న సందీప్ కు 2వ టౌన్ -1గా నియమించారు. 5వ టౌన్ ఎస్సై గంగాధర్ రెంజల్ కు బదిలీ చేశారు. కోటగిరిలో పని చేస్తున్న సునీల్ ను 5వ టౌన్ కు బదిలీ చేశారు. 6వ టౌన్ ఎస్సైగా పని చేస్తున్న వెంకట్ రావును సిటిసికి బదిలీ చేసి వీఆర్ లో ఉన్న యాదగిరికి పోస్టింగ్ ఇచ్చారు. ఇందల్వాయిగా పని చేస్తున్న సందీప్ ను ధర్పల్లి ఎస్సైగా నియమించి అక్కడ పని చేస్తున్న సామ శ్రీనివాస్ ను వీఆర్ కు అటాచ్ చేశారు. వీఆర్ లో ఉన్న సుమలతకు ఇందల్వాయి ఎస్ హెచ్ వోగా నియమించారు. కమ్మర్ పల్లి ఎస్సై అనిల్ రెడ్డిని మాక్లూర్ కు బదిలీ చేయగా అక్కడ పని చేస్తున్న రాజశేఖర్ ను బోధన్ రూరల్ కు పీఎస్ కు బదిలీ చేశారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న మచ్చేంధర్ ను ఎస్ బికి అటాచ్ చేశారు. వీఆర్ లో వెయిటింగ్ లో ఉన్న శ్రీనివాస్ కు కోటగిరి ఎస్సైగా పోస్టింగ్ ఇచ్చారు. వీఆర్ లో ఉన్న మరో ఎస్సై వినయ్ ను నందిపేట్ కు బదిలీ చేసి అక్కడ ఎస్ హెచ్ వోగా పని చేస్తున్న శ్యాంరాజ్ ను వీఆర్ కు అటాచ్ చేశారు. జగిత్యాల స్పెషల్ బ్రాంచ్ లో ఉన్ సతీష్ ను కమ్మర్ పల్లి ఎస్ హెచ్ వోగా నియమించారు. వీఆర్ లో ఉన్న మనోజ్ కుమార్ ను రుద్రూర్ ఎస్సైగా బదిలీ చేయగా అక్కడ పని చేస్తున్న సాయన్నను వీఆర్ కు ట్రాన్స్ ఫర్ చేశారు.
