28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కర్ణాటక సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన డీకే

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఉప ముఖ్యమంత్రి గా డాక్టర్ జీ.పరమేశ్వర్

 

. . . లోక్ భవన్ లో 13 మంది మంత్రులతో కలిపి ఓత్

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

కర్ణాటక నూతన సీఎంగా డీకే.శివకుమార్, తన 13 మంది మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ ఆధ్వర్యంలో బుధవారం లోక్ భవన్ లో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లి కార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సిద్ద రామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీఎంగా డీకే ప్రమాణం చేసిన అనంతరం, ఉప ముఖ్యమంత్రిగా జి.పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేశారు. డీకే తో పాటు యతీంద్ర సిద్ద రామయ్య, ప్రియాంక్ ఖర్గే, కేహెచ్ మునియప్ప, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీశ్ జర్కిహోళి, కె.జె జియార్జ్, క్రిష్ణ భైరిగౌడ, యు.టి ఖదేర్, ఈశ్వర్ కాంద్రే, భైరాతి సురేష్, శరన్ ప్రకాష్ పాటిల్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం డీకే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 

DK sworn in as Karnataka CM

More articles

Latest article