29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జాతీయ జెండాను అవమానపరిచిన వారిపై కేసులు నమోదు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

–  కాంగ్రెస్ నేతలపై స్టేషన్ లో  పిర్యాధు చేసిన బిజెపి పార్టీ నాయకులు..

రుద్రూర్, బతుకమ్మ  :

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్ని మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో మార్కెట్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇండియా ఫ్లాగ్ రూపంలో కేక్ తయారు చేసి కేక్ కటింగ్ చేస్తూ జాతీయ జెండాను అవమానపరిచారని వారిపై కేసులునమోదు చేయాలని బిజేపి నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఈ మేరకు రుద్రూర్ పోలిస్ స్టేషన్ లో… వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా, వైస్ చైర్మన్ కొత్తిమీర్కర్ లక్ష్మణ్, డైరెక్టర్ పార్వతి ప్రవీణ్, నాగయ్య, భారి, గంగారాం ల పై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని బిజెపి పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  పిర్యాదు చేసిన వారిలో బిజెపి నాయకులు బీజేపీ మండల ఉపాధ్యక్షులు బోజగొండ అనిల్, నాయకులు వడ్ల సాయినాథ్, రేపల్లి సాయిప్రసాద్, కుమ్మరి గణేష్, తీగుళ్ల రాజా వరప్రసాద్, బైండ్ల బాలరాజ్, ధర్మరం వెంకటేష్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article