రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని పిఎంశ్రీఎంపిపిఎస్ పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలు మంగళవారం బడి బాట కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులతో ర్యాలీ చేపడుతూ అవగాహన కల్పించారు. ప్రైవేటు పాఠశాలల కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనంతో పాటు విద్యా బోధన బోధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డ్ మెంబర్లు, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
