27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కొలువులో చేరిన నూతన ఉపాధ్యాయులు

Must read

📰 Generate e-Paper Clip

– స్వాగతం పలికిన పిఆర్టియు నాయకులు

బతుకమ్మ, నవీపేట్ : డిఎస్పీ 2024 లో ఎన్నికైన నూతన ఉపాధ్యాయులు బుధవారం నాడు విధుల్లో చేరారు. ఆకాష్, ప్రవల్లిక, మానస, గౌతమి, శ్రావణ్, లు ఎస్.జీ.టి లుగా, జయలక్ష్మి, మహేష్, సౌమ్య, సతీష్ లు స్కూల్ అసిస్టెంట్ లుగా విధుల్లో చేరారు. ముందుగా ఎంఇఓ అశోక్ ను కలిసి తమ నియామక పత్రాలను అందించారు.
ఈ సందర్భంగా పిఆర్టియు జిల్లా అధ్యక్షులు పొద్దుటూరి మోహన్ రెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు భూమయ్య, శివ కుమార్, లు నూతనంగా విధుల్లో చేరిన ఉపాధ్యాయులను అభినందించి పిఆర్టియు సభ్యత్వం అందించారు.

More articles

Latest article