27.4 C
Hyderabad

ఘనంగా ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

ఏర్గట్ల, బతుకమ్మ :

 

తాళ్ల రాంపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ఆయన పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, గృహ ప్రవేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని భానుచందర్, కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరిపల్లి లింగారెడ్డి, ఉప సర్పంచ్ చాట్ల జనార్ధన్, నాగేంద్ర నగర్ సర్పంచ్ సందే రంజిత్, తొర్తి సర్పంచ్ కౌడ భూమేష్, ధోం చంద ఉప సర్పంచ్ ఆసిరెడ్డి హనుమంత్, రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీలు ఆడేం గంగ ప్రసాద్, ధోంచంద రవి రెడ్డి, ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్, మండల కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి మునీర్, ఏర్గట్ల ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తాళ్ల రాంపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, కర్ణల లావణ్య, ఖడ్గం ప్రమీలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Indiramma's grand entrance ceremony

More articles

Latest article